రాజాపేటలో బీజేపీ ధర్నా హాస్యాస్పదం: కాంగ్రెస్ నాయకుల తీవ్ర విమర్శలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలో బీజేపీ నాయకుల ధర్నా హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉండి మండలానికి ఏం తెచ్చారో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను విమర్శించడం మానుకోవాలని, గంధమల్ల ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాస్తవాలు చూడాలని హితవు పలికారు. సింగారం నుంచి లక్ష్మక్కపల్లి వరకు సాగునీరు అందించేందుకు యాభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.