విద్యార్థుల ఉన్నతికి క్రమశిక్షనే పునాది: ప్రిన్సిపాల్ రవిచంద్
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ లక్ష్మమ్మ మెమోరియల్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థుల ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ బీహెచ్ రవిచంద్ మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
చదువుకునే వయసులో అల్లరి సహజమే అయినా, నిజ జీవితంలో హుందాగా ప్రవర్తించి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్ దమయంతి, అధ్యాపకులు సాయిబాబా, సందీప్, కిరణ్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.