విదేశీ బొగ్గు కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్కు కేటీఆర్ తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
సింగరేణి సంస్థ నుంచి లభించే చవకైన బొగ్గును పక్కనపెట్టి భారీ ధరలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ అత్యధిక ధరలకు విదేశీ బొగ్గును కొనుగోలు చేయడం ప్రజలపై అదనపు భారం మోపడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసమే ఇటువంటి అపసవ్య విధానాలను అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ధ్వజమెత్తారు.