స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన జనసేన

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జనసేన పార్టీ ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీ క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి నివేదికలను అందించనుంది. APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా కొనసాగనున్నారు.