అనంతపురంలో అన్ని స్థానిక స్థానాలు గెలుస్తామంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధీమా

రిపోర్టర్: హరి స్థలం: అనంతపురం

రాబోయే స్థానిక ఎన్నికల్లో అనంతపురం కార్పొరేషన్లో మొత్తం అరువై రెండు సీట్లు గెలుస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన ఎన్డీయే కూటమి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా పాలనలో దౌర్జన్యాలతో గెలిచారని, తాము చేసిన అభివృద్ధిని చూపిస్తూ అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. డివిజన్ నుంచి మేయర్ వరకు అందరినీ గెలిపించుకుంటామని తెదేపా జోనల్ ఇన్ఛార్జి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.