ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్: నవంబర్ 13 నుంచి ది థర్డ్ మర్డర్ స్ట్రీమింగ్

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

మలయాళంలో మంచి విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ది థర్డ్ మర్డర్ త్వరలో డిజిటల్ వేదికపైకి రానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సునీల్ ఇబ్రహీం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. వరుస హత్యల నేపథ్యంలో సాగే ఈ ఉత్కంఠభరితమైన చిత్రంలో సైజు కురుప్, ఇంద్రన్స్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రల్ లో నటించారు. థియేటర్లలో అలరించిన ఈ సినిమా కోసం థ్రిల్లర్ చిత్రాల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.