రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం: ఖాతాల్లోకి రెండు లక్షల జమ

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా హిట్ అండ్ రన్ ఘటనల్ లో గాయపడిన నలుగురు బాధితులకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల చొప్పున మొత్తం రెండు లక్షల రూపాయల పరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు విశాఖ సిటీ పోలీస్ వెల్లడించారు. ఇప్పటివరకు రెండు వందల పదిహేడు మంది బాధితులకు కోటీ యాభై ఎనిమిది లక్షల రూపాయల పరిహారం ఇప్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.