గిరిజన రైతన్నల బతుకుల్లో వెలుగులు నింపే రాజ్మా విత్తనాల పంపిణీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ముంచింగిపుట్టు
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ స్వర్ణ గ్రామ కార్యాలయంలో గిరిజన రైతులకు రాజ్మా విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల సంక్షేమం మరియు వారి ఆర్థిక అభివృద్ధే ప్రధాన లక్ష్యమని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. రైతు బాగుంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, టీడీపీ నాయకుడు జగత్రాయ్, చిన్నబాబు, సుభలక్ష్మి, నర్సింగరావు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.