జీవో 97 రద్దుకై రోడ్డెక్కిన విద్యార్థుల ఆక్రోశ గర్జన
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు శనివారం వంటావార్పు నిర్వహించారు. విద్యార్థుల నిరసనకు అధ్యాపకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈసెట్ ద్వారా బీటెక్ లేటరల్ ఎంట్రీ కొనసాగించాలని, డిప్లొమా గుర్తింపును కాపాడాలని, ఫీజు రీయింబర్స్మెంట్, రిజర్వేషన్లు కొనసాగించాలని, ఎస్బీటీఈటీ ఏఐసీటీఈ గుర్తింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో 97ను వెంటనే రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని వారు కోరారు.