విద్యార్థులకు గుడ్ న్యూస్: ఐఐఎం బెంగళూరు ఫిన్‌టెక్ మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేషన్ పూర్తి
రిపోర్టర్: హరి
స్థలం: Bengaluru
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తొలి ఫిన్‌టెక్ సర్టిఫికేట్ కోర్సు మొదటి బ్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఐఐఎం వర్గాలు వెల్లడించాయి. ఈ కోర్సులో 380 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ సహకారంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా యువ నిపుణులకు డిజిటల్ ఆర్థిక సేవల్లో కీలక నైపుణ్యాలు అందించినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.