చెస్ ఒలింపియాడ్: అనారోగ్యంతో పోరాడి దేశానికి పతకాలు తెచ్చిన హంపి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ దేశం కోసం బరిలోకి దిగి పతకాలు సాధించినట్లు ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి వెల్లడించారు. ఒలింపియాడ్ టోర్నమెంట్లో జాతీయ జెండాను సమున్నతంగా నిలపడమే తన ధ్యేయమని, అందుకే తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలు ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా మందులు వాడుకుంటూ వరుసగా మ్యాచ్‌లు ఆడి రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నట్లు ఆమె తెలిపారు.