మర్రిపాడులో అసంపూర్తిగా తాగునీటి పథకాలు: ఇబ్బందుల్లో స్థానిక ప్రజలు

రిపోర్టర్: రాము స్థలం: మర్రిపాడు

మండల కేంద్రమైన మర్రిపాడులో తాగునీటి పథకాల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయినట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పది శాతం పనులు మిగిలివున్నా బిల్లుల మంజూరులో జాప్యం కారణంగా గుత్తేదారు పనులను నిలిపివేశారని తెలిపారు. ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసినప్పటికీ నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయించి, కుళాయిల ద్వారా తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.