పలాస జడ్పీ హైస్కూల్లో ఎస్ఎంసీ చైర్మన్ ఏకగ్రీవ ఎన్నిక ఘనం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పీఎం శ్రీ జడ్పీ హైస్కూల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం ఘనంగా జరిగింది. నూతనంగా ఎన్నికైన చైర్మన్ గొజ్జ రాధ, వైస్ చైర్మన్ తంగుడు అచ్యుత్ లను నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.