జడ్చర్లలో బాణసంచా అందుకుని మురిసిపోయిన పేద చిన్నారులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: జడ్చర్ల

జడ్చర్ల పట్టణంలో దీపావళి పండుగ వేళ స్వచ్ఛంద సేవకుడు జర్పూల భాస్కర్ నాయక్ చిన్నారులకు బాణసంచా పంపిణీ చేశారు. చిన్నారుల ముఖాల్లో ఆనందం నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఉత్సాహంగా గడిపి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవా కార్యక్రమాలను మునుముందు కూడా నిరంతరం కొనసాగిస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.