దేశంలోనే తొలి స్వదేశీ మైక్రో జీపీయూని అభివృద్ధి చేసిన ఐఐటీ ఢిల్లీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఢిల్లీ

దిగుమతి చేసుకునే జీపీయూ టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఐఐటీ ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధకులు దేశంలోనే తొలి స్వదేశీ మైక్రో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్లు జయదేవ, కౌశిక్ సాహా మార్గదర్శకత్వంలో ఎం.టెక్ విద్యార్థులు నమ్మి ఆకాశ్, రవి తేజ ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సాంకేతికత ద్వారా ఎంబెడెడ్ అప్లికేషన్లకు అవసరమైన స్వదేశీ గ్రాఫిక్స్ వ్యవస్థలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశోధకులు ప్రణాళికలు రచిస్తున్నారు.