ప్రధాని మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ నిప్పులు: బహిరంగ చర్చకు సవాల్

రిపోర్టర్: శివ స్థలం: ఏకతా నగర్

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ లో ప్రధాని మోదీ చేసిన విమర్శలకు సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ బదులిస్తూ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సోషల్ మీడియా విదేశీ శక్తుల నియంత్రణలో ఉందని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనకు ధైర్యం ఉంటే ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధం కావాలని ప్రధానికి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.