2029 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తానన్న బొత్స సత్యనారాయణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా తానే పోటీ చేయనున్నట్లు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గరివిడిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన ఆరోగ్యం బాలేదని, రాజ్యసభకు వెళ్తానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. నాతో ఆర్థిక సంబంధాలున్న వారే పార్టీని వీడుతున్నారు తప్ప, కార్యకర్తలు ఎవరూ వెళ్లలేదని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.