ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారానికి మోదీ, జిన్‌పింగ్ ముందుకు

రిపోర్టర్: సతీష్ స్థలం: రష్యా

ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సహాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి స్థాపన కోసం మోదీ, జిన్‌పింగ్ చేసిన ఈ ప్రతిపాదనను పుతిన్ స్వాగతించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై రష్యాకు పూర్తి వివరాలు అందించాలని కోరగా, శాంతి మార్గమే శ్రేయస్సని మోదీ స్పష్టం చేశారు.