ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు తీపి కబురు: బ్యాంకర్లతో ప్రత్యేక రుణ సదుపాయం

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించే దిశగా హౌసింగ్ బోర్డు కీలక ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు. ఏడాదిలోగా గృహాల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయంలో ఆరు లక్షల రూపాయలను వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించామని వెల్లడించారు. పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు ఇప్పించేందుకు హౌసింగ్ బోర్డు అధికారులు బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.