మెదడులో కణితి లేకపోయినా 11 ఏళ్లుగా కీమోథెరపీ!
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
బ్రిటన్కు చెందిన బెకీ జోన్స్ అనే మహిళకు 2012లో తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి రావడంతో వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తప్పుగా నిర్ధారించారు. ఆమె 11 ఏళ్లపాటు అనవసరంగా కీమోథెరపీ చేయించుకున్నారు. ఇటీవల వేరే వైద్యులు రిపోర్టులు పరిశీలించగా ఆమెకు క్యాన్సర్ లేదని, మెదడులో వాపు సమస్య మాత్రమేనని తేలింది. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు.