కరవు ప్రాంతాలను ఆదుకోండి: కేంద్ర బృందాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితుల కారణంగా రైతుల ఆదాయం పడిపోయిందని, పంట రుణాల రీషెడ్యూల్ తో పాటు బాధితులకు రాయితీపై నిత్యావసరాలు అందించాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర బృందంతో సమావేశమైన ఆయన, రాష్ట్రంలో ప్రకటించిన నూట పన్నెండు కరవు మండలాల్ లో ప్రత్యేక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు.