అమెరికా 911 దాడుల బాధితుల్లో భారతీయులే ఎక్కువంటూ ప్రధాని మోదీ నివాళి

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రవాద దాడుల ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. అమెరికన్ల తర్వాత అత్యధికంగా ప్రాణాలు కోల్పోయినవారు భారతీయులేనని ఆయన తెలిపారు. తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కుటుంబాలకు కోట్లాది మంది భారతీయుల తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 2014లో తాను ప్రధానమంత్రి అయిన వెంటనే న్యూయార్క్ వెళ్లినప్పుడు ఆనాటి బాధితులకు నివాళులు అర్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.