విశాఖలో మత్స్యకారుడు మైలపల్లి చంటి దారుణ హత్య

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో మత్స్యకారుడు మైలపల్లి చంటిని దుండగులు హత్య చేశారు. తలపై కర్రతో బాది, నైలాన్ తాడుతో ఉరివేసి అత్యంత క్రూరంగా చంపేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి చెందిన చంటి, కుటుంబంతో కలిసి విశాఖలో ఉంటున్నాడు. సోదరి అప్పలకొండ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, పాత కక్షలు లేదా ఆర్థిక లావాదేవీల కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.