ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కీలక భేటీ: స్థానిక ఎన్నికలపై ప్రత్యేక చర్చ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం కానున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య స్థానాల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై వీరిద్దరూ చర్చిస్తారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున తదుపరి కార్యాచరణపైనా చర్చిస్తారని వెల్లడించారు. ఈ భేటీ అనంతరం కూటమి సమన్వయ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తారని స్పష్టం చేశారు.