టీడీపీని ఎన్డీయేకు దూరం చేసేందుకు శ్రమించానంటూ విజయసాయి రెడ్డి సంచలనం

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

టీడీపీని ఎన్డీయే కూటమికి దూరం చేయడానికి తాను 2016 నుండి 2018 మధ్య తీవ్రంగా శ్రమించానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఏపీ రాజకీయంలో ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారానికే తమ పార్టీ కృషి చేస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు.