ఒంగోలు మున్సిపాలిటీ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
రిపోర్టర్: హరి
స్థలం: బాపట్ల
ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల ఘన చరిత్రకు ప్రతీకగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఒంగోలు పట్టణాన్ని సంప్రదాయాలను పరిరక్షిస్తూనే, అత్యాధునిక మౌలిక వసతులతో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. స్థానిక అభివృద్ధే ధ్యేయంగా అంకితభావంతో మునుముందుకు సాగుతామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.