వైరల్ వీడియోపై స్పందించిన పాకిస్థాన్ క్రికెటర్ తండ్రి కాషిఫ్ మిన్హాస్
రిపోర్టర్: శివ
స్థలం: Multan
పాకిస్థాన్ యువ క్రికెటర్ అరాఫత్ మిన్హాస్ తండ్రి కాషిఫ్ మిన్హాస్ తన కుమారుడు ఔట్ అయినప్పుడు భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ కావడంపై స్పందించారు. ముల్తాన్లో తమకు మంచి కార్ల వ్యాపారం ఉందని, ఫొటోగ్రఫీ కేవలం తన అభిరుచి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారమైన తప్పుడు వార్తలు తనను తీవ్రంగా బాధించాయని కాషిఫ్ మిన్హాస్ ఆవేదన వ్యక్తం చేశారు.