మెలానియా ట్రంప్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: రాము
స్థలం: వాషింగ్టన్ డిసి
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్ పై చేసిన ఒక పచ్చి జోక్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఐక్యరాజ్యసమితిలో ఎస్కలేటర్ ఆగిపోయిన ఘటనను గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాషింగ్టన్ డిసిలోని ఓవల్ ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్, మెహ్మెత్ ఓజ్ నవ్వుతూ కనిపించారు.