తీరంలో తుపాను బీభత్సం: నేలకొరిగిన వరి పంటతో అల్లాడుతున్న అన్నదాతలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Vizianagaram
అర్నబ్ తుపాను ప్రభావంతో రోజంతా వీచిన ఈదురు గాలులు, తెరిపివ్వని వర్షాలకు జిల్లాలో వరి పైరు నేలకొరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయ సర్వీసులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోగా, అధికారులు 145 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తూ ముందస్తు భద్రతా చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.