పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గోపీచంద్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ హీరో గోపీచంద్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ వ్యక్తిత్వాన్ని, విజయాలను కొనియాడుతూ ఆయన చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. రెండు దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య ఉన్న గాఢమైన స్నేహబంధాన్ని సినీ అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.