అటవీ ఆంక్షలతో జన్నారంలో ఆగిపోయిన అభివృద్ధి.. తాపీ మేస్త్రి సంఘం ఆవేదన

రిపోర్టర్: p.g. murthy స్థలం: జన్నారం

అటవీ ఆంక్షలతో జన్నారం మండలంలో అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయని తాపీ మేస్త్రి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జన్నారంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక వేత్త భూమాచారికి శుక్రవారం వారు సంఘీభావం తెలిపారు.

ఈ ఆంక్షల వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరకడం కష్టంగా మారిందని నాయకులు వాపోయారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అటవీ నిబంధనలను సడలించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.