జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఆకట్టుకున్న పురుషుల ఫ్యాషన్
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
డెబ్బై రెండవ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుకలో సినిమా విజయాలతో పాటు పురుషుల ఫ్యాషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నటులు ధరించిన విభిన్న వస్త్రధారణ అందరి దృష్టిని ఆకర్షించింది. సాంప్రదాయ వస్త్రాల నుంచి సరికొత్త బాంధ్గాలా కుర్తాల వరకు ప్రతి ఒక్కరి స్టైల్ సినిమా వేడుకలో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్లను సృష్టించిందని ఫ్యాషన్ ప్రియులు కొనియాడుతున్నారు.