విడపనకల్లు జెడ్పీటీసీ సీటును బీజేపీకే కేటాయించాలంటూ కూటమి నేతలకు కీలక విజ్ఞప్తి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విడపనకల్లు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లా విడపనకల్లు మండల జెడ్పీటీసి స్థానాన్ని కూటమి ఒప్పందంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించాలని సంధిరెడ్డి నారాయణస్వామి కుటుంబ సభ్యులు కూటమి అగ్రనాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు లేఖ ద్వారా వినతిపత్రం పంపినట్లు సంధిరెడ్డి లక్ష్మి తెలిపారు.