అసెంబ్లీలో 22ఏ భూముల రగడ, బీజేపీ-కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారం దుమారం రేపింది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ బీజేపీ సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ ఆందోళనల మధ్య అసెంబ్లీ కాసేపు వాయిదా పడింది. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సీబీఐ విచారణను కేంద్రం ఎందుకు తొక్కిపెట్టిందని ఆయన నిలదీశారు.