రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్గా పూర్ణచందర్ రాజు నామినేషన్

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ పదవికి ఆత్మకూరు(ఎం) మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ప్రతికంఠం పూర్ణచందర్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 4న జిల్లా ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోలిపురం ఎల్లారెడ్డి, జెట్ట యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు.