ఉత్తరాంధ్రను ముంచెత్తిన వరదలు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు

రిపోర్టర్: గోపి స్థలం: North Andhra

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. పలుచోట్ల వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని, జలాశయాలు నిండుకుండలా మారాయని పేర్కొన్నారు. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయని వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులకు ఆహార పొట్లాలు అందజేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.