నడుము నొప్పి బాధితులకు డాక్టర్ సాయి శివ తడకమళ్ల కీలక సూచనలు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
నడుము నొప్పితో బాధపడుతున్న వారికి బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ సాయి శివ తడకమళ్ల పలు కీలక సూచనలు చేశారు. గంటల తరబడి కూర్చోవడం, తప్పుగా బరువులు ఎత్తడం వల్ల వెన్ను సమస్యలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. నొప్పి తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సాయి శివ తడకమళ్ల స్పష్టం చేశారు.