పర్యావరణ హితం కోరుతూ మట్టి వినాయకుల పూజల పిలుపు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకో క్లబ్ ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలనే వాడాలని పిలుపునిచ్చారు. చవితికి వాడే 21 రకాల పత్రాల ప్రాముఖ్యతను, వాటి ద్వారా వ్యాధుల నివారణను విద్యార్థులకు వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.భాస్కర్ రాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఉపయోగించి జీవరాశిని కాపాడాలని కోరారు.