ఆదర్శకుటుంబం చిత్రంలో అమ్మ పాత్ర చేయడంపై నటి శ్రీనిధిశెట్టి స్పందన
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
వెంకటేశ్‌కి జోడీగా నటిస్తున్న ఆదర్శకుటుంబం సినిమాలో అమ్మ పాత్ర చేసేందుకు ఆలోచించకుండా అంగీకరించానని కథానాయిక శ్రీనిధిశెట్టి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం తన కల అని పేర్కొన్నారు. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో మొదటిసారిగా కామెడీ పాత్ర చేశానని, త్రివిక్రమ్ మాటల మాజిక్ సినిమాను సరికొత్త స్థాయిలో నిలబెడుతుందని చెప్పారు. ఈ నెల ముప్పైవ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు.