నామినేషన్ల పోటీకి వినూత్న వేదిక: వేలం పాట ద్వారా స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపిక
రిపోర్టర్: సురేష్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీలో స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపిక వినూత్నంగా సాగుతోంది. ఈ పంచాయతీలో గత నూట ముప్పై ఏళ్లుగా ఏకగ్రీవ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పదవి కోసం ఎక్కువ మంది పోటీపడిన సందర్భాల్లో వేలం పాట నిర్వహించి, ఎక్కువ మొత్తం పాడుకున్న వారికే అభ్యర్థిత్వం కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. వేలం ద్వారా వచ్చిన నిధులను గ్రామాల అభివృద్ధి పనుల కోసం పూర్తిగా వెచ్చిస్తున్నామని గ్రామ పెద్దలు వివరించారు.