గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసు: సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది అని న్యాయ నిపుణులు తెలిపారు. రౌడీషీటర్ సాయికృష్ణ కేసు విచారణను రాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బాధితుడి తల్లి విజయలక్ష్మికి నాలుగు వారాల్లోగా ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మే నెలలో కృష్ణలంక పోలీసుల అదుపులోకి వెళ్లిన సాయికృష్ణ చిత్రహింసల కారణంగానే మృతి చెందినట్లు సిట్ నిర్ధారించింది.