బరువు తగ్గాలనుకునే వారికి హెల్త్ అలర్ట్: స్ట్రెంథ్ ట్రైనింగ్‌తో లాభాలు
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు వ్యాయామంతో పాటు స్ట్రెంథ్ ట్రైనింగ్ చేయడం వల్ల శరీరంలో కొవ్వు కణాలు త్వరగా కరుగుతాయని పరిశోధకులు వెల్లడించారు. లైఫ్‌సైన్సెస్ అధ్యయనం ప్రకారం, బరువు తగ్గడానికి ముందే జీవక్రియ మెరుగ్గా మారుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సరైన డైట్ పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా గుండె సమస్యలను దూరం చేసుకోవడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.