కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కావలి మున్సిపల్ కమిషనర్ను నిలదీసిన టీయూసీసీ

రిపోర్టర్: సునీల్ స్థలం: కావలి

కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీయూసీసీ డివిజన్ అధ్యక్షుడు ఏసు డిమాండ్ చేశారు. కావలి పురపాలక సంఘం కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మికులపై కక్షసాధింపు చర్యలను, మహిళా కార్మికులపై వేధింపులను తీవ్రంగా ఖండించారు. క్లస్టర్ల మార్పు పేరుతో వేధిస్తే ఊరుకోబోమని, సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.