చెత్తతో కంపుకొడుతున్న డివిజన్లలో విలవిల్లాడుతున్న పౌరుల బతుకులు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఏడో డివిజన్లో రహదారుల వెంట చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని డివిజన్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంతో సమస్య మరింత జటిలమవుతోందని తెలిపారు. వెంటనే చెత్తను తొలగించి క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరగా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.