లూధియానాలో పోలీసుల ఎన్‌కౌంటర్.. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు హతం
రిపోర్టర్: రాజేష్
స్థలం: పంజాబ్
పంజాబ్‌లోని లూధియానాలో రక్తదాన శిబిరంపై దాడికి కుట్ర పన్నిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. అమృత్‌సర్‌కు చెందిన కరణ్‌జోత్ సింగ్, సందీప్ సింగ్‌లుగా వారిని గుర్తించారు. నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.