తమిళనాడుకు ప్రత్యేక రాష్ట్ర జెండా త్వరలో వస్తుందంటూ మంత్రి ఆదవ్ అర్జున్ సంచలనం

రిపోర్టర్: సతీష్ స్థలం: చెన్నై

తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక జెండాను త్వరలో ప్రవేశపెడతామని ఆ రాష్ట్ర మంత్రి ఆదవ్ అర్జున్ ప్రకటించారు. అనేక రాష్ట్రాలకు ప్రత్యేక జెండాలు ఉన్నాయని, మన రాష్ట్రానికి కూడా అది అవసరమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటనపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇది వేర్పాటువాద మనస్తత్వాన్ని రెచ్చగొట్టేలా ఉందని, జాతీయ సమైక్యతకు భంగం కలిగించే ప్రయత్నమని బీజేపీ నేత వినోజ్ పి సెల్వం విమర్శించారు. ఈ పరిణామం ప్రస్తుతం రాజకీయ దుమారానికి దారితీసింది.