యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే కార్యాలయ గణనాథుడి నిమజ్జనం అత్యంత ఘనంగా నిర్వహణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కార్యాలయంలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేసి, భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించి సైదాపూర్ చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.