తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చేరుకున్న పదకొండు పట్టు గొడుగులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ కోసం తమిళనాడులోని హిందూ ధర్మార్థ సమితి సమర్పించిన పదకొండు పట్టు గొడుగులు తిరుమలకు చేరుకున్నాయి. చెన్నై చెన్నకేశవ పెరుమాళ్‌ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా తొలుత తిరుచానూరు అమ్మవారికి రెండు గొడుగులు సమర్పించారు. అనంతరం తిరుమలలో సమితి ట్రస్ట్ ఆర్.ఆర్.గోపాల్ జీ, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వీటిని అందజేశారు. వరుసగా ఇరవై రెండవ సారి ఈ పట్టు గొడుగులను సమర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.