ఆమనగల్లులో విద్యార్థులకు పోలీసు విధివిధానాలపై ఆసక్తికరంగా ఓపెన్ హౌస్ అవగాహన
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ ప్రైవేటు హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సంతోష్ పోలీసుల విధులు, స్టేషన్ నిర్వహణ, అత్యాధునిక సాంకేతికతపై విద్యార్థులకు సమగ్రమైన అవగాహన కల్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి సేవలను కొనియాడారు.