దేశంలో స్వదేశీ హైస్పీడ్ రైళ్ల తయారీకి కేంద్రం నిర్ణయం

రిపోర్టర్: శివ స్థలం: భారతదేశం

దేశంలో గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లే స్వదేశీ హైస్పీడ్ రైళ్లను 2030 నాటికి అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సవరించిన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా తొలి దశలో బీ28 రైళ్లను నడపనుండగా, 508 కిలోమీటర్ల ఈ కారిడార్‌ను 2030 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.